సనత్ నగర్ జనసేనలో చేరికలు

సనత్ నగర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి సనత్ నగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుండి యువత భారీగా జనసేనలో చేరడం జరిగింది. సనత్ నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ కావ్య వారికి జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అలాగే యువత మాట్లాడుతూ వారు జనసేనలో పార్టీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందని అలాగే పవన్ కళ్యాణ్ ఆశయాలు అడుగుజాడల్లో నడుస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.