అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్న ప్రదేశంలో జనసేన నిరసన

  • ఈ దోపిడీ మాకొద్దు జగన్ … ఇక వైసిపికి గుడ్ బై జగన్…

కోవూరు, ఎంఎల్ఏ ప్రసన్న అనుచరులతో కెజిఎఫ్ కోవూరు గ్రావెల్ ఫ్యాక్షన్ నడిపిస్తున్నారు అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు బద్దెపూడి సుధీర్ కోవూరు నియోజకవర్గం, గ్రామదత్తంలో స్థానిక జనసేన కార్యకర్తలతో అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్న ప్రదేశంలో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల గ్రావెల్ అక్రమంగా తరలి పోతుంది. మొన్నటి వరకు కనిగిరిబెరిజర్వ్యాయర్ వద్ద ౩౦ అడుగుల మేర వంద ఎకరాల పైబడి అక్రమంగా తవ్వి ప్రజలు గమనించే సరికి ఇప్పుడు వంగల్లు నుంచి దారు మళ్లించి దోచుకుంటున్నారు. వీటి తరలింపుకి గ్రామాల రోడ్లు నాశనం అయ్యాయి, గ్రామాలకు కనీసం రోడ్లు ఒక 10 కిమీ కూడా వేసిన దాఖలాలు లేవు. కోట్ల రూపాయల ప్రజా ధనం దోచుకుని ఆ డబ్బు తో ఓటర్లను కొనుక్కోవాలని చూస్తున్నారీ ప్రసన్న,ఎటు చూసిన దోపిడీలు దురాక్రమణలతో దశాబ్దాలు పాలించినా నియోజకవర్గ అభివృద్ధి సూన్యం. ఊరికి ముందు ప్రతిపక్షాలను విమర్శించే ప్రసన్న తన సొంత నియోజకవర్గంలో ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. అనుచరుల దౌర్జన్యాలతో కనీసం ప్రశ్నించే వారే లేకుండా చివుసికుంటున్నారు, గ్రామాలల్లో ఇంటింటికి కార్యక్రమం పోవాలనుంటే అక్కడుండే చిన్న కార్యకర్తలను కూడా అకారణంగా పోలీసులతో పిలిపించుకుని రోజంతా అక్కడే ఉండేట్లు చేస్తున్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారు రానున్న రోజులలో మీ కుటుంబ పాలనకు చరమగీతం పాడుతారు. దురాక్రమణలకు గురైన ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వారి స్థలాలకు మీరు జవాబు చెప్పి తీరాలి. ఈ త్రవ్వకాల వలన రేపు వరదలు వఛ్చి కట్టలు తెగితే దాదాపు 10గ్రామాలు నీట మునుగుతాయి. నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీల గురించి సమగ్ర సమాచారంతో మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకి పంపుతామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ మరియూ ప్రజా ఆస్తులను దుర్వినియోగం నివారించాలంటే ప్రజా ప్రభుత్వం జనసేనకి మద్దతు ఇఛ్చి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షులు బద్దెపూడి సుధీర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, సాయి, షారూ, ఇబ్రహీం, మౌనేష్, షాజహాన్, కాసీఫ్, ఋషి, సోహైల్ తదితరులు పాల్గొన్నారు.