పల్లె పల్లెకు జనసేన సిమెంట్ బెంచీలు

నెల్లూరు: మర్రిపాడు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో పల్లె పల్లెకు జనసేన సిమెంట్ బెంచీలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం మంచాల పల్లి గ్రామంలో సిమెంట్ బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెందుర్తి నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి గోన్న రమాదేవి సహకారంతో నిర్వహించగా, మండల ప్రధాన కార్యదర్శి కాకి జాషువా అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాపూరు మహిళా మండల అధ్యక్షురాలు కోండాపురం కస్తూరి మర్రిపాడు మండల జనసేన అధ్యక్షురాలు ప్రమీల ఒరుగంటి, కలువాయి మండల జనసేన నాయకులు శ్రీరాం మనోహర్ పువ్వాడి నరేష్ చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కస్తూరి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని 2024లో ముఖ్యమంత్రిని చేసేందుకు అన్ని వర్గాల వారు కృషి చేయాలని కోరారు. మర్రిపాడు మండల అధ్యక్షురాలు ప్రమీల మాట్లాడుతూ ఈ బెంచ్ సహకరించిన గోన్న రమాదేవికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతసాగరం మండల అధ్యక్షులు మస్తాన్ దుడ్డు, చిన్నా కోమ్మూరి రాజు, శ్రీరాం, మనోహర్, పెనగలూరు చిన్నయ్య, పుల్లయ్య, కాకి జాషువా, సంధ్య పాల్గొని విజయవంతం చేశారు.