వైసిపి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన జనసేన డివిజన్ ఇన్చార్జిలతోనూ, డివిజన్, పట్టణ కమిటీ నాయకులతోనూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ అప్పలనాయుడు మాట్లాడుతూ ఓటరు పరిశీలన, హౌస్ మ్యాపింగ్ పై అవగాహన ఉండాలన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలను గృహసారథులుగా నియమించాలని, వీరిలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాల స్థాయి కమిటీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్ని ఇంటికి పంపేస్తారన్నారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలలో పార్టీ మరింత బలోపేతమయ్యే విధంగా పట్టణ, డివిజన్ నాయకులు నాయకులు పని చేయాలన్నారు. వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతోందని, కేవలం సంక్షేమ పథకాలను దూరం చేస్తారనే భయంతోనే ప్రజలు జగన్ చిత్రంతో ఉన్న స్టిక్కర్లను ఇళ్లకు అంటిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశి నరేష్, బోండా రాము నాయుడు, దోసపతి రాజు, పసుపులేటి దినేష్, కందుకూరి ఈశ్వరరావు, సరిది రాజేష్, కావూరి వాణి, జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.