యువత విద్యకు బానిసలు కావాలే తప్ప మత్తు పానీయాలకు కాదు: రోసనూరు సోమశేఖర్

సూళ్లూరుపేట నియోజకవర్గం, మాకు తెలిసిన 20 ఏళ్ల కుర్రాడు శుక్రవారం రాత్రి తాగిన మత్తులో ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. మా మనసు కలిచివేసింది. పేద కుటుంబం, ఒక్కడే కొడుకు, తల్లి చాలి చాలని వేతనానికి ఒక సంస్థలో చిన్న పని, కొడుకు మీద ప్రేమతో కాదనలేక శ్రమించి, కొనిచ్చే స్థోమత లేకున్నా ద్విచక్ర వాహనం తీసిస్తే ఆ కుర్రవాడేమో ఈ వయసులో తాగుడు అదేదో ట్రెండ్ లాగా ఫీల్ అవ్వడం, ఏక్సిడెంట్ లో చనిపోయాడు, ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంటి! సూళ్లూరుపేట నియోజకవర్గంలో యువత గంజాయి, వీడ్, ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. పట్టించుకునే నాయకుడు కానీ, అధికారులు కానీ లేరు. యువత ముఖ్యంగా అణచివేతకు గురైన జాతులకు చెందిన యువత ఆలోచించండి! మీరు విద్యకు బానిసలు కావాలే తప్ప మత్తు పానీయాలకు కాదు. చదువు మీ జీవితాలను ప్రపంచంతో పోటీ పడేలా చేస్తుందని సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన నాయకులు రోసనూరు సోమశేఖర్ అన్నారు.