పాఠశాలల మౌళిక వసతులకై శేరిలింగంపల్లి జనసేన వినతిపత్రం

శేరిలింగంపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించాలని కోరుతూ జనసేన పార్టీ శేరిలింగంపల్లి కో ఆర్డినేటర్ డా. మాధవ రెడ్డి జనసేన పార్టీ తరఫున ఎం.ఈ.ఓ కు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాథమిక పాఠశాలల్లో అధ్యాపకులు లేరు ఉన్నత పాఠశాలల్లో అధ్యాపకులు ఉన్నా మౌళిక సదుపాయాలైన శౌచలయం, మంచినీటి సదుపాయం, మధ్యాహ్న భోజన పథకం ఏవి సరిగ్గా లేవు తరగతి గదులు శుభ్రంగా లేవు. ప్రభుత్వం చదువుకునే అవకాశం ఇవ్వకుండా తల్లితండ్రులు తమ పిల్లలకు చదువుకొనే పరిస్థితి లేక నేటితరం భావిభారత పౌరులను చెడు వ్యసనాలకు అలవాటు కావడానికి పరోక్షంగా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కొందరు నాయకులు గొప్పలు చెబుతున్నారు కానీ వారి సుపుత్రుల సంవత్సరం చదువుకు 9 లక్షల 50 ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం మార్పు చేశాం అని గొప్పలు చెప్పుకునే దొర కొడుకు అంత గొప్ప మార్పు జరిగిన పాఠశాలల్లో ఎందుకు చదివించడం లేదు. మార్పు కోసం ఈ ప్రభుత్వానికి పాఠశాలల్లో జరుగుతున్న అవకతవకలు తెలియజేయడమే జనసేన పార్టీ ముఖ్యఉద్దేశం. పాఠశాలలకు రానున్న 2 నెలలు సెలవు దినాలు కాబట్టి ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు యుద్ద ప్రాతిపదికన సెక్రటేరియట్ కట్టినట్టు రాష్ట్రంలో వున్న ప్రతి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అని జనసేన పార్టీ తరుపున రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చెయ్యాలని గుర్తుచేస్తున్నాము. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాకు దిశా నిర్దేశం చేశారు. ఒకటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తున్నాం. 15 రోజుల్లో ఉన్నత అధికారులకు కన్ఫర్మేషన్ ఇస్తాము. 2 నెలల వరకు ఈ సమస్య ఇలాగే వుంచితే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వీధి పోరాటం చేసి ప్రభుత్వ పని తీరును ప్రజల దృష్టికి తీసుకెళ్తామని ఒక జనసైనికుడిగా నేను సమస్యను పరిష్కరించే వరకు పోరాటం చేస్తూ ఉంటాను. ప్రజా శ్రేయస్సు కోరుకొనే ఏకైక భావజాలంతో నడుస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. ప్రతి సమస్యను ప్రభుత్వానికి, ప్రజాక్షేత్రంలో ఉన్న గుడ్డిగా నమ్ముకుంట వెళ్తున్న ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ముందుకు వెళ్తామని డా. మాధవ రెడ్డి తెలియజేసారు. చందానగర్ డివిజన్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ మరియు జనసైనికులు ద్రాక్షాయని, సందీప్ కసెట్టి, సూర్య దమ్ములురి, శ్రవణ్, రాజగోపాల్, అశోక్, రవి కుంచల, సాయి సతీష్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.