తెట్టు గ్రామంలో జనంలోకి జనసేన

  • గడప, గడపకు తిరుగుతారు కానీ సమస్యలు పరిష్కరించరు

కందుకూరు: జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లేందుకు రూపొందించిన జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఇనకొల్లు శ్రీనివాస్ పిలుపు మేరకు జనసేన నాయకులు అన్నంగి చలపతి, కేసారపు లక్ష్మణ్, కొనికి రాజేష్, తాటిపర్తి కోటి, గుండెమడుగుల భాస్కర్, గుండెమడుగుల రమేష్ తెట్టు గ్రామంలో యస్.టి కాలనీలో పర్యటించారు. వీరి వెంట స్థానిక జనసేన యువకులు షేక్ రహంతుల్లా, చలంచర్ల శ్రీను తిరిగి స్థానిక సమస్యలను క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా చలపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారేమో సంక్షేమ పథకాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు, బటన్ నొక్కుతున్నాము అంటున్నారు. సమస్యలు మాత్రం పల్లెల్లో, కాలనీల్లో ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయని ఈ ప్రాంత మహిళలు వాపోయారని వివరించారు. స్థానిక జనసేన యువకులు షేక్ రహంతుల్లా, చలంచర్ల శ్రీను వివరిస్తూ చిన్న చిన్న మౌలిక సదుపాయాలైన మంచినీటి వసతి, డ్రైనేజీ, రోడ్లు వంటివి సక్రమంగా నిర్వహించకుండా పధకాలు ఇస్తున్నామని గడప, గడపకు తిరుగుతూ గొప్పలు చెప్పుకుంటున్నారు. లక్ష్మణ్, భాస్కర్ మాట్లాడుతూ ప్రజాధనమే పధకాల రూపంలో కొందరికి ఇస్తూ వైకాపా పెద్దల జేబులోంచి ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.