మనుపాటి బుల్లెమ్మ కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన “బత్తుల”

రాజానగరం, సీతానగరం మండలం మిర్తిపాడు గ్రామంలో మనుపాటి బుల్లెమ్మ ఇటీవల మరణించిన విషయం తెల్సుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి, మనోదైర్యం చెప్పి కుటుంబ అవసరాల నిమిత్తం ₹5,000 /- రూపాయలు ఆర్దిక సహాయం మరియు 25 కేజిల బియ్యం జనసైనికుల చేతుల మీదుగా రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి అందించడం జరిగింది. వీరి వెంట కొండేటి సత్యనారాయణ, రుద్రం నాగు, మట్టా వెంకటేశ్వరరావు, మద్దాల యేసుపాదం, చీకట్ల వీర్రాజు, బండి సత్య ప్రసాద్, వనము వెంకటలక్ష్మి, గెడ్డం కృష్ణ, తన్నీరు సురేష్, కిలాడీ ఎర్రయ్య, బర్నీక్కల దుర్గ ప్రసాద్, పెంటపాటి శివ, పంపరబోయిన బాపూజీ, చిడిపి బ్రహ్మాజీ, పంపరబోయిన రాంబాబు, కె. రాంబాబు, మరియు ఇతర నాయకులు, గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.