పిడుగు పాటుతో మృతి చెందిన సంబునాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన డా. గంగులయ్య

అల్లూరీ సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం, పోతురాజు గుమ్మలు గ్రామంలో గత వారం ఏప్రిల్ 21వ తేదీన పశువులు కాస్తూ అకారణంగా పిడుగు పాటు వలన వంతల సంబునాయుడు మృతి చెందారు. విషాదంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. గంగులయ్య మరియు ఇతర నాయకులు కలిసి పరామర్శించారు. ఈ సందర్బంగా డా. గంగులయ్య మాట్లాడుతూ ఇంటి పెద్దదిక్కు కోల్పోయిన విషాదంలో వున్నారు. మా వంతుగా చేతనైన సాయం చేస్తూ మిమ్మల్ని పరమర్శించాలని వచ్చాం. అకాల వర్షాలకు గిరిజన రైతులు అప్రమత్తంగా ఉండాలని, పిడుగుపాటు వలన ఏజెన్సీ ప్రాంతాల్లో మరణాలు అధికమవుతున్నాయి, ఇటువంటి అకాల, అసహజ ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే మరణాలు కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ విషయమై సంబంధిత అధికారులకు కోరుతున్నామని తెలిపారు. అలాగే మీ కుటుంబానికి జనసేన పార్టీ తరుపున మీకు అండగా ఉంటామని ఈ సందర్బంగా మీకు తెలియజేస్తున్నామన్నారు. చనిపోయిన సంబు నాయుడు మరణానికి 5 నిమిషాలపాటుగా జనసేన పార్టీ నాయకులందరు మౌనం పాటించి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ పరామర్శలో చింతపల్లి మండల నాయకులు కిల్లో రాజన్ (జనసేనపార్టీ లీగల్ అడ్వైజర్), వంతల బుజ్జిబాబు, దేపురు రాజు, సందేశ్, చిట్టిబాబు, నాయక్, సూరిబాబు, ఐటి ఇన్చార్జ్ అశోక్, హరిశ్, శ్రీను తదితర జనసైనికులుపాల్గొన్నారు.