రాష్ట్రంలో యువత చూపు జనసేన వైపే: గంగారపు రామదాస్ చౌదరి

  • జనంతో “టీ” జనసేన

మదనపల్లె: రాష్ట్రంలో ప్రస్తుతం యువత జనసేన పార్టీ వైపు చూస్తోందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తపల్లిలో జనంతో టీ జనసేన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో మమేకం కావడానికి జనసేన పార్టీ నాయకులు గ్రామస్తులతో కలిసి టీ తాగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో వెనుకబడి ఉందని, వైసిపి ప్రజా ప్రతినిధులు ఎవరు మదనపల్లె అభివృద్ధిని పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ముఖ్యంగా మదనపల్లె జిల్లా కావడానికి అన్ని అర్హతలు ఉన్నా ఇక్కడ పాలకులు జిల్లా కాకుండా చేశారన్నారు. అదేవిధంగా హంద్రీనీవా కాలవ ద్వారా కృష్ణా జలాలు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. కనీసం ఇక్కడ వర్షాలతో నిండే అవకాశం ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు మొరవ నిర్మాణం చేపట్టకపోవడంతో ఎడారిగా మారాయని విమర్శించారు. ప్రజా అవసరాలకు ఉపయోగపడు పనులు ఏవి చేయలేదన్నారు. సమావేశాల్లో మాత్రం అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపట్టినట్లు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, నాయకులు అడపా సురేంద్ర, జగదీష్ ,గ్రానైట్ బాబు, సనా ఉల్లా, జనార్ధన్, రెడ్డెమ్మ, అర్జున, కుమార్, లక్ష్మీపతి, శంకర తదితరులు పాల్గొన్నారు.