మే డే శుభాకాంక్షల పోస్టర్ ఆవిష్కరించిన నేమూరి శంకర్ గౌడ్

కూకట్పల్లి, మే డే సందర్భంగా వివిధ రంగాల్లోని కార్మికుల శ్రమను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మే డే శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్ శుభాకాంక్షల పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కరోనా సమయంలో విపత్తులో ఉన్న ప్రజలతోపాటు కనీస వేతనం కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్న కార్మికులకు నిత్యవసర సరుకులు మరియు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న జనసైనికులు అందరిని అభినందిస్తూ కార్మికులకు అండగా ఎల్లవేళలా జనసేన పార్టీ ఉంటుందని అన్నారు. అనంతరం జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ విభాగ కమిటీ సభ్యులుగా నియమించిన పెన్నమరెడ్డి నాగబాబుని తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మండలి దయాకర్, తుమ్మల మోహన్, కొల్లా శంకర్, పెన్నమరెడ్డి నాగబాబు, నాగేంద్ర, వేముల మహేష్, వెంకటేశ్వరరావు, సునీంద్రబాబు, ప్రసాద్ పసుపులేటి, ప్రసాద్ కలిగినేని తదితరులు పాల్గొన్నారు.