బూత్ స్థాయి కమిటీలు వేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: డా.పసుపులేటి హరిప్రసాద్

పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లి మండలం, దేవదొడ్డి మరియు ఎం.కొత్తూరులో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా, పలమనేరు నియోజకవర్గం నాయకులు జిల్లా కార్యదర్శి పసుపులేటి దిలీప్ మరియు మండల అధ్యక్షులు చైతన్య ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక రాయల్ మహల్లో పలమనేరు నియోజకవర్గ జనసైనికులు సమావేశంలో అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ ప్రతి మండలంలో కమిటీలు ఉన్నాయని, ఇక బూత్ స్థాయి నుండి కమిటీలు వేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి మండలంలో ప్రతి గడపకి పార్టీ సిద్ధాంతాలు తీసుకుని వెళ్ళాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో గత వారం రోజుల్లో ఆరు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు, ఐదు కార్యకర్తల సమావేశాలు జరిగాయని, ప్రతి ఊరు వాడలో జనసేన వైపు ప్రజలు చూస్తున్నారని అధ్యక్షులు తెలియజేశారు. అనంతరం వైసిపి పార్టీలో పనిచేస్తున్న కీలక నాయకులు సుమారుగా 50 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో 5 మండలాల ఇంచార్జీలు, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, జిల్లా ఉపాధ్యక్షులు మధు, జి.డి నెల్లూరు ఇంచార్జీ యుగంధర్, ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, కార్యదర్శులు ఆనంద్, బాటసారి, రామ్మూర్తి, వేణు, మునియప్ప జన సేన నాయకులు అరుణ్, నియోజకవర్గ ఐటి కో ఆర్డినేటర్ భరత్, మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.