వరదా దుర్గాప్రసాద్ కు మనోధైర్యాన్నిచ్చిన బత్తుల

రాజానగరం, సీతానగరం మండలం చిన కొండేపూడి గ్రామంలో జనసైనికుడు వరదా దుర్గాప్రసాద్ కి ఇటీవల యాక్సిడెంట్లో ఎడమ కాలికి గాయం కాగా జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారిని పరామర్శించి ధైర్యం చెప్పి జనసేన పార్టీ ఎల్లపుడూ జనసైనికులకు అండగా ఉంటుందని ఈ సందర్బంగా తెలియజేయడం జరిగింది. దుర్గా ప్రసాద్ కుటుంబానికి 25 కేజీల బియ్యం జనసైనికుల చేతుల మీదుగా బత్తుల అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితోపాటు మద్దాల యేసు పాదం, మట్టా వెంకటేశ్వరరావు, నాగారపు సత్తిబాబు, కాండ్రేగుల పోసి రత్నాజీ రావు చౌదరి, చీకట్ల వీర్రాజు, సంగిశెట్టి శ్రీను, కోన లక్ష్మి, పందుల వెంకన్న, కడియం విష్ణు, కొండగట్టు చంటి, బైలంపూడి శ్రీను, యేసు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.