అక్రమ కట్టడాలపై జనసేన ఉక్కు పాదం: జనసేన మురళి

అనంతగిరి: మండలంలో ఎక్కడపడితే అక్కడ ప్రభుత్వ భూములు కబ్జాకు గురై గిరిజనేతరులు దర్జాగా భవంతులు నిర్మిస్తున్నారని, మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి వైయస్సార్ కాలనీ దగ్గర గిరిజన నేతలు అక్రమంగా నిర్మిస్తున్న భవనం నిలుపుదల చేయాలని, ప్రభుత్వ భూములకు పరిరక్షణ కల్పించాలని సోమవారం మండల తాసిల్దార్ కు జనసేన మండల అధ్యక్షుడు మురళి వినతి పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కొంతమంది తమ స్వంత జిరాయితి భూములుగా బిట్లు బిట్లుగా చేసి అమ్ముకోవడం దారుణమని, దీనిపై రాజకీయ నాయకులు అధికారులు ఎందుకు స్పందించటం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని, తమ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడతాదని, ఇలా లక్షల్లో అమ్ముకొని అధికారులకు నాయకులకు సగం జేబులో నింపుతుండటం వలన అధికారులు నాయకులు మౌనం వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ భవనాలు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకుని గ్రామంలో కొత్తగా పెళ్లయిన వారి కుటుంబాలకు గ్రామ కంట భూములను ప్రభుత్వ భూములను ఇల్లు కట్టుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు జనసేన మురళి తెలిపారు.