అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలి: పితాని బాలకృష్ణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం ఇటీవల నాలుగు రోజుల నుండి అకాల వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో వరి కళ్లాలోకి వెళ్లి వర్షాలకు తడిసిపోయిన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల ధాన్యం కళాల్లోనే ఉండిపోయి నీటి పాలైందన్నారు. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. పంట చేతికందివచ్చే సమయంలో అకాల వర్షాలకు పంట నీటమునిగిందన్నారు. నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తునప్పటికీ కనీసం వ్యవసాయాధికారులు ఎవరూ క్షేత్ర స్థాయిలో పరిశీలించలేదన్నారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడా ఏర్పాటు చేయలేదన్నారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. రైతు భరోసా కేంద్రాలు వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు.ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరతో ఇబ్భందులు పడుతున్నారు అన్నారు. ప్రభుత్వం మద్దతు ధర 1530 రూపాయిలు ప్రకటించాం అని చెప్పడం తప్ప రైతు చేతికి 1300 రూపాయలు అంతకన్నా తక్కువకి అడుగుతున్నారని అన్నారు.దానికి తోడు ప్రభుత్వం ఎకరానికి 45బస్తాలే కొంటాం అని నిబంధనలు పెట్టడంతో మిగులు పంట ఏమి చేయాలో తెలియని గందరగోళ పరిస్థితిలో ఈ రోజు రైతు ఉన్నాడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా వర్షాలకు పాడయిన పంటలకు ఇన్సూరెన్స్ ఇవ్వలేదని, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే బస్తాకు 300 రూపాయలు తక్కువకి అడుగుతున్నారని అయినా కొనే నాథుడే లేడని అన్నారు.ఇక ఆర్ బి కే విషయానికి వస్తే గడిచిన 5రోజులు నుండి రైతులు వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయకపోవడం అకాల వర్షాలుతో ధ్యానం వర్షానికి తడిచిపోయింది‌. ఈ నష్టపోయిన పంటకు ప్రభుత్వామే బాధ్యత వహించాలి. రైతుకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం ప్రకటించిన రేటుకి ధాన్యం కొనుగోలు చేయాలని లేనిపక్షంలో జనసేన పార్టీ తరుపున ఉద్యమిస్తాం అని పితాని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే నియోజకవర్గం పలు గ్రామాలు తిరుగుతూ రైతులు యొక్క సమస్య ను రైతు దగ్గరకు వెళ్లి తానేలంక మరియు మట్టాడుపాలెం ముమ్మిడివరం బైపాస్ దగ్గర కు వెళ్లి వాళ్లకు ఉన్న సమస్య అడిగి తెలుసుకున్న పితాని బాలకృష్ణ.
రైతులు పితాని బాలకృష్ణ కు రైతులు యొక్క ఆవేదన విన్నాబుంచుకున్నారు. ధాన్యం వెంటనే మీరు చొరవ తీసుకుని కనుగొలు చేసే విధంగా ఆదుకోవాలి అని లేని యెడల ఆత్మహత్య మాకు శరణ్యం అన్నారు రైతులు గోడును పితాని బాలకృష్ణకు విన్నపించుకున్నారు. నియోజకవర్గంలో ఉన్న రైతులు అందరకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అండగా ఉంటాడు అని మీరు ఎట్టి పరిస్థితిలో ఆత్మహత్యకు పాల్పడావద్దు అని పితాని బాలకృష్ణ దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు గోలకోటి వెంకనబబు రాష్ట్ర సహయ కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ టౌన్ ప్రెసిడెంట్ కడలి వెంకటేశ్వరావు దూడలా స్వామి నాయుడు సాయిబాబు బొక్క శ్రీను మదలా సాయి అర్జునరావు విత్తన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.