పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ తాళ్ళరేవు మండలం ఉప్పంగల గ్రామంలో అకాల మరణం చెందిన పైడికొండల వెంకటేశ్వరరావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తాళ్ళరేవు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ముత్తుతు మణికంఠని పరామర్శించారు. ఐ పోలవరం మండలం, భైరవపాలెం తీర్థాలమొండి గ్రామ వాస్తవ్యుడు పోతాబత్తుల వెంకట సుబ్రహ్మణ్య వర్మ(19) ఇంటర్ 2ంద్ ఇయర్ విద్యార్థి ఇటీవల దురదృష్టవశాత్తు మరణించారు. కావున ఆ విద్యార్థి తండ్రి పోతాబత్తుల వెంకటరత్నంని మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్నిచ్చారు. వీరివెంట వెంట మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, ఉభయగోదావరి జిల్లా మహిళా కోఆర్డినేటర్ ముత్యాల జయలక్ష్మి, ఉప్పంగల గ్రామ ప్రెసిడెంట్ గుత్తాల బాలకృష్ణ, వంగ త్రిమూర్తులు, పోతాబత్తుల నాగేశ్వరరావు, చింతా నూకరాజు, ఓలేటి మణికంఠ, ఓలేటి బాబి, పోతాబత్తుల గంగాధరరావు, పోతాబత్తుల రాంబాబు, పెమ్మాడి గంగాద్రి మరియు నాయకులు జనసైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు.