రైతులకు ప్రభుత్వం అండగా ఉండి నష్టపరిహారం చెల్లించాలి: బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి, మొక్కపాడు గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలను ఆలోచన విధానాలను పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో భాగంగా నిర్వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి జనసేన అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం మొక్కపాడు గ్రామంలో ఎంతో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి జనసేన యొక్క సిద్ధాంతాలను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సీఎంగా చేసే విధంగా మనందరం కష్టపడాలని అదేవిధంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న విధానాన్ని, అలాగే అకాల వర్షాల కారణంగా మిర్చి అలాగే మొక్కజొన్న రైతులను కలిసి పంట నష్ట యొక్క వివరణ తెలుసుకుంటూ ఎంతోమంది రైతులు పంట నష్టపోయి వాళ్ళ కన్నీటి బాధలు చూసి చలించిపోయిన బొర్రా వెంకట అప్పారావు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, ప్రజల సమస్యలు తెలుసుకుని వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు తీర్చాల్సిన ప్రభుత్వం రైతులను యొక్క బాధలను గాలికి వదిలేసారని బొర్రా వెంకట అప్పారావు మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై ప్రజలకు వివరణ ఇస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండల అధ్యక్షుడు తోట నరసయ్య, గ్రామ అధ్యక్షుడు పోకల శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యుడు దుగ్గి విజయ్, ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్, రూరల్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, నకరికల్ మండల అధ్యక్షురాలు తాడువే లక్ష్మి శ్రీనివాస్, ఏడో వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, చిలకా సత్యం, వైస్ ప్రెసిడెంట్ రఫీ రుద్రజడ బుల్లబ్బాయి, గ్రామ జనసైనికులు పులిబండ్ల గోపి, దుగ్గి రాంబాబు, పశావుల సీతయ్య, పశావుల సత్యనారాయణ, దుగ్గి అశోక్, వెంకట అయ్యప్ప, నాన్న బాలశేఖర్, నిమ్మల సురేష్, బిట్రగుంట సుబ్బారావు, నారపుశెట్టి కోటేశ్వరరావు, పెమ్మ రమేష్, పగడాల నరసింహారావు, ఆశుల గోపి పెద్ద ఎత్తున గ్రామ జనసైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.