కుక్కల బెడద నుంచి కదిరి పట్టణ వాసులకు విముక్తి కలిగించాలి: జనసేన వినతిపత్రం

తాడిపత్రి: నిజాం వలి కాలనీలో బుధవారం ఇర్ఫాన్ 7 సంవత్సరాల బాలుడిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆ బాలుడు ప్రాణాపాయ స్థితిలో మెరుగైన వైద్యం కోసం అనంతపురం సవేరా హాస్పిటల్ నందు వైద్యం తీసుకోవడం జరుగుతోంది. బాలునిపై కుక్కల దాడికి ప్రధాన కారణం అధికార పార్టీ నాయకుల మరియు మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణం. కదిరి పట్టణంలో ఏ వీధిలో చూసినా ఏ రోడ్డుపై చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా ఉండటం వల్ల స్థానిక ప్రజలు, పిల్లలు, వృద్దులు బయటకు రావాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదిరి పట్టణ వాసులు. నిన్నటి రోజు ఆ బాలునికి మెరుగైన వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించి ఆ కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని, భవిష్యత్తులో ఇటువంటి దయవిచారకరమైన సంఘటనలు పునరావృత్తం కాకుండా సత్వరమే కుక్కల బెడద నుంచి కదిరి పట్టణ వాసులకు విముక్తి కలిగించాలని కదిరి జనసేన, బీజేపీ పార్టీ తరపున మునిసిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ విషయంపై మునిసిపల్ కమీషనర్ స్పందిస్తూ.. ఇటువంటి ఘటన జరగడం చాలా బాధాకరం ఆ బాలునికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని ఆ బాలుని వైద్యం కోసం అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుందని అదే విధంగా కదిరి పట్టణంలో ఉన్న కుక్కల్ని పట్టడం కోసం ఒక ప్రత్యేక బృందాన్ని రప్పించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కదిరి జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్, బీజేపీ పట్టణ అధ్యక్షులు నంది శెట్టి బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, కదిరి పట్టణ అధ్యక్షులు కాయల చలపతి, సీనియర్ నాయకులు వానిల్లి అంజిబాబు, 36 వార్డ్ ఇంచార్జీ హరి బాబు, బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు నందిశెట్టి బాబు, తలుపుల గంగాధర్, మైనొద్దిన్, హరి వాల్మీకి, గోవర్ధన్, చలపతి, జనార్ధన్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.