ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట పాదయాత్ర..

ఏలూరు: ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా ఆదివారం 17వ డివిజన్, పడమర వీధిలోని గాంధీ మైదానం వద్ద నుండి జనసేన పోరుబాట పాదయాత్రను మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, మేకా సాయి, వంశీ ఇక్కడ ఉన్న జనసేన పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నామని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు.. ప్రతి డోర్ లో ప్రజలు తమ యొక్క ఆవేదనను మాకు తెలియజేస్తున్నారని అన్నారు.ఈ వైసీపీ దుర్మార్గపు ప్రభుత్వం ఏవో కుంటి సాకులు చెప్పి పెన్షన్లు తీసివేస్తున్నారని మండి పడ్డారు. చెత్త ఆలోచన చేసి చెత్తపై పన్నును వసూలు చేస్తున్నారు. కరెంటు బిల్లును విపరీతంగా పెంచి వేశారు. ఏదైనా పనిచేద్దామంటే ఉపాధి లేదు. మా పిల్లలకు మంచి చదువున్న ఇక్కడ ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నామని ఎప్పుడు ఎలక్షన్లో వస్తాయో ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్క గడప తొక్కుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన ప్రభుత్వాన్ని చూడాలని ఆ ఒక్క ఆలోచనతో అందరూ ఉన్నారని రేపు రాబోయే రోజుల్లో కచ్చితంగా జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఆయన తెలియజేశారు..కుంటు సాకులు చెప్పే కరెంటు బిల్లు పెంచుతున్నారని ఈ దుర్మార్గపు పాలనను ఇకనైనా అంతమొందిస్తామని ఇప్పటికీ గెలిచిన శాసనసభ్యులు ఎక్కడ కనిపించట్లేదు అని వచ్చి పెళ్లి సంబరాలు చేసుకుని అట్టహాసంగా ఊరేగింపుగా వెళ్తున్నారే తప్ప ప్రజల సమస్యలు ఇతనికి కనిపించట్లేదని నియోజకవర్గ ప్రజలు ఇతన్ని ప్రశ్నిస్తున్నారు ? ప్రజల పక్షాన నిరంతరం ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ? ఏలూరు నియోజకవర్గంలో గాని ఈ రాష్ట్రంలో గాని జనసేన పార్టీ జనసైనికులు వీర మహిళలు జనసేన పార్టీ నాయకులు ప్రజలకు ఎప్పుడూ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి సరళ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, స్థానిక నాయకులు మేకా సాయి, వంశీ, రాజు, భాను, లోయసాయి, దాసరి శ్రీరామ్, గోవాడ చైతన్య, వినయ్, కిరణ్, మట్రాజు విజయ్ భాస్కర్, నాగిరెడ్డి మదన్, పేటేటి ప్రవీణ్, మణికంఠ, నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, బోండా రాము నాయుడు, కీర్తి కృష్ణ నాయుడు, పవన్, అధత్ర సురేష్, చీమల గోపి, తవిటి రాజు, వెంకట రమణ, రాపర్తి సూర్యనారాయణ, హరీష్, జనపరెడ్డి తేజ ప్రవీణ్, పొన్నూరు రాము, దోసపర్తి దుర్గారావు, 1 టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా సుజాత, 2 టౌన్ మహిళ సెక్రటరీ తుమ్మపాల ఉమాదుర్గ, కోశాధికారి ప్రమీల రాణి, బీబీ తదితరులు పాల్గొన్నారు.