తెలంగాణలో మరో 3 నియోజకవర్గాలకు కార్యనిర్వాహకుల నియామకం

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గానూ గతంలో 29 నియోజకవర్గాలలో కార్యనిర్వాహకులను ఎంపిక చేయగా రాజాగా మరో 3 నియోజకవర్గాలకు కార్య నిర్వాహకులను నియమిస్తున్నట్లు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ నేమూరి శంకర్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ తెలంగాణ కార్యవర్గం కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం తెలంగాణ కార్యవర్గం ఆ దిశగా పని చేస్తున్నారని తెలిపారు.

3 నియోజకవర్గాల కార్య నిర్వాహకులు

  1. వరంగల్ (పడమర) నియోజకవర్గం భైరి వంశీకృష్ణ
  2. వరంగల్ (తూర్పు) నియోజకవర్గం బాలు గౌడ్
  3. పాలకుర్తి నియోజకవర్గం- వి. నగేష్