క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లను సత్కరించిన గాదె

సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అద్యక్షులు వెంకటేశ్వరరావు చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి దాదాపు 3500+ సభ్యత్వాలు చేసిన వాలంటీర్లు అందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు. ఈ 3వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎవరైతే వాలంటీర్లుగా కష్టపడ్డారో వారందరికీ వెంకటేశ్వరరావు ఘనంగా సత్కరించి అభినందించడం జరిగింది. అలాగే గుంటూరు జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 934 సభ్యత్వాలు చేసి మొదటి స్థానంలో నిలిచిన శిరిగిరి మణికంఠను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.