జనసేనాని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పార్వతీపురంలో రక్తదాన శిభిరం

  • ప్రతి 21 రోజులకు రక్తం కోసం ఎదురుచూసే తలసేమియా బాధిత పిల్లల కోసం ఈ రక్త దాన శిభిరం ఏర్పాటు
  • 127 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి అభిమానం చాటుకున్నా జనసైనికులు
  • జనసేనపార్టీ ఆదేశాలు మేరకు రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకున్న పార్వతీపురం జనసేన  నాయకులు

పార్వతీపురం: శుక్రవారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా శుక్రవారం “రక్తదాన” కార్యక్రమం పార్వతీపురం నియోజకవర్గ సీనియర్ నాయకులు, గంగిరెడ్ల జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొబ్బిలి జనసేన ఇంఛార్జి గిరడ అప్పలస్వామి, ఎస్ ఈ బి ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, రాష్ట్ర ఐ.టీ కోఆర్డినేటర్ గేదెల సతీష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, పార్వతీపురం మూడు మండల అధ్యక్షులు, ఐ.టీ కోఆర్డినేటర్, జనసైనికులు, వీరమహిళలు మాట్లాడుతూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చెయ్యడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి 21 రోజులకు రక్తం కోసం ఎదురుచూసే తలసేమియా బాధిత పిల్లల కోసం ఈ రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చాలా గర్వంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఇంతగా జయప్రదం చేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.