*విద్య, వైధ్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత
*ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత
*జనసేననేత వబ్బిన సన్యాసి నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాధాన్యత రంగాలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి పధంలో పయనించేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ దోహదపడుతుందనీ సన్యాసి నాయుడు తెలిపారు. జాతీయ గ్రామీణ జీవనోపాదుల పథకం( యన్ ఆర్ యల్ యం) స్కీంకు 790 కోట్లు కేటాయించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడి, అభివృద్ధికి దోహధము చేస్తుందన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పి పి పి)తో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రోత్సాహంగా ప్రాజెక్టు వ్యయంలో 20 శాతం వరకు వయాబులిటీ గ్యాప్ పండింగ్ కోసం రూ. 2000 కోట్ల కార్పస్ ఫండ్ ను ప్రతిపాదించడం శుభ సూచకమని తెలియజేశారు. ఇదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ లో సూక్ష్మ, చిన్న, పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చారని తెలిపారు. తెలుగు భాషాభివృద్ధి కోసం పది కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా తెలుగు భాష, సాంస్కృతిక అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. నైపుణ్య అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు “ఆదరణ” పథకాన్ని పునరుద్దరించటం ద్వారా వివిధ వృత్తుల జీవనోపాది మెరుగవుతుందన్నారు.గిరిజన ప్రాంతాలు, ఐటిడిఏల అభివృద్ధికి అత్యధికంగా నిధులు ఇవ్వడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేశారన్నారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖకు రూ. 1028 కోట్ల నిధులు ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రంలో నైపుణ్యాన్ని అభివృద్ధిని పెంపొందించి ఉద్యోగ ఉపాధి కల్పనకు బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. ప్రధానంగా నీటిపారుదల, వ్యవసాయం, ప్రాథమిక, ఉన్నత విద్యారంగానికి అత్యధికంగా నిధులు కేటాయించారని తెలిపారు. “తల్లికి వందనం 15 వేలు పథకాన్ని మే లో ప్రారంభించడం ద్వారా చదువుకుంటున్న పిల్లలకు విధ్యాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల రూపాయల ఆరోగ్య భీమా పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా, సామాన్య పేదల ఆరోగ్యం పట్ల కూటమిప్రభుత్వానికి ఉన్న శ్రద్దకు నిదర్శనమన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణానికి అధిక నిధులు కేటాయించడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సన్యాసి నాయుడు తెలిపారు. బడ్జెట్ లో ప్రధానంగా స్వయం సహాయ సంఘాలకు కేటాయింపులు పెంచడం ద్వారా మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వము చిత్త శుద్ధికి నిదర్శనమని జనసేన నేత వబ్బిన సన్యాసి నాయుడు పేర్కొన్నారు.
Share this content:
Post Comment