పార్వతీపురం, అభివృద్ది, సంక్షేమం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయని జనసేన నాయకులు చందక అనిల్ అన్నారు. అమరావతి నిర్మాణం కోసం రూ.6000 కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.4,220 కోట్లు, వైద్య, విద్యా శాఖలకు రూ.23,260 కోట్లు, ఎన్టీఆర్ భరోసాకు రూ.27,518 కోట్లు, మత్స్యకారులకు భరోసా కింద రూ.450 కోట్లు కేటాయింపు జరగడం హర్షణీయం అన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలుకు బడ్జెట్లో తగిన కేటాయింపులు జరపడం, “తల్లికి వందనం” పథకాన్ని ఈ ఏడాది మే నుంచి అమలు చేసేందుకు రూ.9,407 కోట్లను, అన్నదాతలకు భరోసానిచ్చేలా, ఏడాదికి రూ.20 వేలు ప్రతి రైతుకు సాయం అందేలా “అన్నదాత సుఖీభవ” పథకానికి ప్రణాళికలు సిద్ధం చేయడం, సాగు నీటి రంగానికి రూ.18,019 కోట్లు కేటాయింపులు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్ ఉందని అభివర్ణించారు. అభివృద్దికి అమడ దూరంలో ఉన్న పల్లెలు అభివృద్ది పధంలో దూసుకుపోయే విధంగా గ్రామీణాభివృద్ధికి రూ.18,890 కోట్ల భారీ కేటాయింపుల ద్వారా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది చెందనుందని చందక అనీల్ అభిప్రాయపడ్డారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు రాష్ట్ర ప్రజలందరి తరుపున కృతజ్ఞతలు తెలిపారు.
Share this content:
Post Comment