ఒంటిమిట్టలో జనంలో జనసేన

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, ఒంటిమిట్ట మండలం, చిన్నకొత్తపల్లెలో జనంలో జనసేన కార్యక్రమంలో బాగంగా జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు మరియు జనసైనికులు ఇంటింటికి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ను వివరించి కరపత్రాలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సేకరించి రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన పార్టీ ద్వారా పరిష్కారం చూపుతామని జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కట్టా మల్లికార్జున, ఒంటిమిట్ట సురేష్, శ్రీరాములు, బి.సుబ్బయ్య, బాస్కర్, వెంకి, తేజ, సలామ్, ప్రేమ్, సిరాజ్, ప్రేమ్, సిరాజ్, రవి, కె.సుబ్బయ్య, వినయ్, విష్ణు, నరసింహులు, పెంచలయ్య, కార్తిక్, నాగేంద్ర, ప్రవీన్, మరియు మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.