శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం పిల్లల ప్రాణాలకు ముప్పు

  • శిథిలావస్థలో ఉన్న యూపీ పాఠశాల భవనాన్ని సందర్శించిన జనసేన నాయకులు

పాడేరు నియోజకవర్గం: జి.మాడుగుల మండలం, గెమ్మెలి పంచాయతీ పరిదిలో మద్దులబంద గ్రామంలో యూపీ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఈ పాఠశాలని గురువారం జనసేన నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులు స్పందించి ఆలోచన చెయ్యాలి. ప్రజాప్రతినిధులకు అసలు వాస్తవాలు తెలియకపోవడం విడ్డూరం. ఇటువంటి పాఠశాలలో విద్యార్థులకు ఏదైనా జరగరానిది జరిగితే ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటుంది తప్ప ముందస్తుగా చర్యలు తీసుకునేంత దూరదృష్టి ఉండదు. మరీ నాడు-నేడు అంటూ కోట్లాది రూపాయలు ఎక్కడపోతుందో ప్రజలు గమనించాలని, ఇటువంటి చిన్న పాకలో గిరిజన విద్యార్థుల చదువుల కోసమేనా నాడు నేడు పథకమని ఎద్దేవా చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కొత్త భవనం ఏర్పాటు చేయాలని లేని పక్షాన జనసేన పార్టీ తరుపున విద్యార్థుల తల్లిదండ్రులతో దీక్ష చేస్తామని జనసేన పార్టీ నాయకులు హెచ్చరించారు. జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, మండల అధ్యక్షులు మసాడి భీమన్న, కార్యనిర్వహణ అధ్యక్షులు తాంగుల రమేష్, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్ పాల్గొన్నారు.