గొలకోటి వెంకటేశ్వరరావుకు అంతిమ వీడ్కోలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండల అధ్యక్షులు గొలకోటి వెంకటేశ్వరరావు(వెంకన్నబాబు) బైక్ మీద నుండి పడిపోవడం వల్ల ప్రమాదవశాత్తు గురువారం అకాల మరణం చెందడం జరిగింది. ఆయన మరణవార్త తెలిసి పితాని బాలకృష్ణ దిగ్భ్రాంతి చెంది ప్రగాడ సంతాపం తెలియజేసారు. ముమ్మిడివరం జనరల్ హాస్పిటల్ నందు పోస్ట్ మార్టం అనంతరం ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంవద్ద ఆయన భౌతికకాయానికి పార్టీ జెండాను కప్పి, నివాళులు అర్పించి, శ్రద్ధాంజలి ఘటించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ. పార్టీ పంపించిన నాయకులుగా పెద్దాపురం ఇంచార్జ్ తుమ్మల రామస్వామి నాయుడుగారు జిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి హాజరయ్యి నివాళులు అర్పించారు. వారి స్వగృహమైన చెయ్యేరు గున్నేపల్లి నందు బౌతిక కాయానికి జనసేన పార్టీ పిఏసి సభ్యులు పితాని బాలకృష్ణ పూలమాల సమర్పించి, నివాళులు అర్పించారు. అంతిమయాత్ర చివరి వరకూ, దహనసంస్కారాలు పూర్తయ్యేవరకు అక్కడే ఆ కార్యక్రమాలలో పాల్గొన్న పితాని బాలకృష్ణ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, జిల్లా కార్యదర్శి పిట్టా జానకిరామయ్య, కాట్రేనికోన, ఐ పోలవరం, తాళ్లరేవు మండలాల అధ్యక్షులు, ముమ్మిడివరం నగర పంచాయతీ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.