ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో పూర్తి స్థాయి అధ్యాపకులు నియమించాలి

  • జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు

అరకు వేలి మండలం పరిధిలోగల ప్రభుత్వ మహీళా డిగ్రీ కళాశాలలో పూర్తి స్థాయిలో అధ్యాపకులను నియమించాలని, ప్రిన్సిపాల్ తో కళాశాల నడుస్తుంది డిగ్రీ కళాశాల మహిళా వసతి గృహంలో వెంటనే ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలి. పాత బిల్డింగ్ మరమ్మతులు చేయాలి. మహిళ వసతి గృహంలో మంచినీరు మరుగుదొడ్లు సదుపాయం కల్పించాలి. 2019 సంవత్సరంలో మహిళ డిగ్రీ కళాశాల ప్రారంభం అయింది. ఇప్పటివరకు ఒక్క ప్రిన్సిపాల్ తోనే కళాశాల నడుస్తుంది విద్యార్థినిలు నాణ్యమైన విద్య అంధక అనేక సమస్యలతో సతమత మౌతున్నారు. మాదాల శ్రీరాములు ఈ సందర్భముగా మాట్లాడుతూ గిరిజన ప్రజా ప్రతినిధులు గిరిజన విద్యా విద్యార్థినిల పట్ల నాణ్యమైన చదువు అందించకుండా దూరం చేయడానికి పూర్తిస్థాయిలో అధ్యాపకులు నియమించకుండా మొండ్డిగా వ్యవహరిస్తున్నారు మంచినీరు మరుగుదొడ్లు ప్రహరీ గోడ లాంటి సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అలాగే మరమ్మత్తులు గురైన పాత బిల్డింగ్ మరమ్మత్తులు చేయకుండా ముండిగా వ్యవహరిస్తున్నారు స్థానికంగా ఉన్న ఐటిడిఏ పిఓ అల్లూరి జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం సిగ్గు చేటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి, ఎంపికి విషయం తెలిసిన మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థులు గురించి సమస్యల గురించి పట్టించుకోవడం లేదు ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో పూర్తి స్థాయి అధ్యాపకులు నియమించక పోతే జనసేనపార్టీ అద్వర్యంలో విద్యార్థులతో కలిసి అధ్యాపకులు నియమించే దాకా పోరాటం చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ సర్వనాశనం చేసేవిదంగా వ్యయహరిస్తుంది గిరిజన ప్రాంతంలో అరకు నియోజకవర్గంలో ఉన్న ఏకైక మహిళ డిగ్రీ కళాశాలలో వెంటనే పూర్తి స్థాయి సదుపాయాలు కల్పించి పూర్తి స్థాయి అధ్యాపకులు నియమించాలి విద్యార్థులకు నాణ్యమైన విద్యా అందించాలి అని జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు డిమాండ్ చేశారు.