మహిళలకు రక్షణతో కూడిన భవిష్యత్తు జనసేనపార్టీ ద్వారా మాత్రమే సాధ్యం…!

జరిగిన ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎంపీటీసీ అభ్యర్థి గెలుపు కోసం తన వంతుగా శ్రమించిన జనసేనాని తల్లి పేరు పెట్టుకున్న వీరమహిళ శ్రీమతి అంజనాదేవి రావూరి రాబోవు కాలంలో జనాసేన పార్టీ మహిళల భవిష్యత్తు కోసం పెద్దపీట వేస్తుందని ఆమె అన్నారు. అధినేత ఆశయాలు, సేనాని మీద నమ్మకంతో దైర్యంగా ప్రజా క్షేత్రంలోకి ప్రత్యక్షంగా వచ్చానని మరియు గత టిడిపి పాలకులు, ఇప్పటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. ఈ నెల 16న జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపు వీర మహిళల సమిష్టి గెలుపని అన్నారు.