రాజోలు మహిళల స్వయం ఉపాధికి శుభారంభం

*జనహిత మహిళా శక్తి ఉపాధి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

రాజోలు గ్రామంలో మహిళల కోసం స్వయం ఉపాధిని ప్రోత్సహించే నోబెల్ కార్యక్రమంగా, జ్యూట్ బ్యాగ్స్ తయారీ శిక్షణా కేంద్రాన్ని గౌరవ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం ప్రారంభించారు. తదేకం ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో ఏర్పాటైన ఈ కేంద్రం ద్వారా మహిళలు ఉపాధి పరంగా స్వతంత్రంగా ఎదిగే దిశగా తొలి అడుగు వేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “మహిళలు తమ కాళ్లపై నిలబడాలి. స్వయం ఉపాధి ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మొదట్లో అడ్డంకులు ఉన్నా, శ్రమకు ఫలితం తప్పదు,” అని అన్నారు. కేంద్ర ఏర్పాటులో భాగస్వాములైన ఉల్లిశెట్టి అన్నపూర్ణ, కడలి ఈశ్వరి, ఏఎల్ఈఏపి మరియు తదేకం ఫౌండేషన్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, శిక్షణ పొందుతున్న మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment