అమలాపురం జనసేన కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

అమలాపురం: నూతన సంవత్సరం పురస్కరించుకొని సోమవారం అమలాపురం జనసేన కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా నియోజకవర్గ పార్లమెంట్ ఇంచార్జ్ డిఎంఆర్ శేఖర్ గారు కేక్ కటింగ్ చేసి వృద్ధులకు వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎక్స్ మున్సిపల్ చైర్మన్ యాల్ల సతీష్, అమలాపురం నియోజకవర్గ జనసేన పార్లమెంట్ గౌరవ అధ్యక్షులు నల్లా శ్రీధర్, అమలాపురం రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు, ఉప్పలగుప్తం మండల జనసేన అధ్యక్షులు ఆకుల సూర్యనారాయణ మూర్తి, చల్లపల్లి ప్రెసిడెంట్ ఇసుక పట్ల రవిబాబు, అయితబత్తుల ఉమామహేశ్వరరావు, మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు.