ఆత్మకూరు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో చైర్మన్, జనసేన పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ గారి సూచన మేరకు ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ ఆశయాలను మరియు స్లొగన్‌లను ర్యాలీగా చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ 106 వ సవరణ పుస్తకాన్ని జనసేన నాయకులకు మరియు జనసైనికులకు నియోజకవర్గ సీనియర్ నాయకులకు మండల అధ్యక్షులు ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం ముందు ఆయన జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు జనసేన సీనియర్ నాయకులు నాయకులు మరియు ఆత్మకూరు నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ పులిపాటి అనిల్ కుమార్ మాట్లాడుతూ సామాజికన్యాయం స్వేచ్ఛాయుత సమాజంలోనే బడుగు బలహీనవర్గాల సంక్షేమం సాధ్యమని ఆ మహాశయుడు భావించారని తెలిపారు. అలాంటి మహనీయుల ఆశయాలను ప్రతిఒక్కరూ కొనసాగించాల్సి ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని, యువత ఆయన ఆశయాలను కొనసాగించాలని, ఆయన వేసిన బాటలో అందరూ నడవాలనివారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆత్మకూరు టౌన్ నాయకులు వంశీ కృష్ణ, గణేష్, నియోజవర్గ సీనియర్ నాయకులు పసుపులేటి శ్రీరామ్, ఏఎస్ పేట మండల అధ్యక్షులు అక్బర్ బాషా మర్రిపాడు మండల అధ్యక్షులు ప్రమీల చిన్న జనసేన గారు సంఘం మండల సీనియర్ నాయకులు దాడి భాను కిరణ్, రూరల్ నాయకులు పవన్ కళ్యాణ్, అఖిల్, వనం పవన్ తిరుమల, శ్రీను, రాజేష్, శ్రీనివాసులు, వసీం, నజీర్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment