పసుపులేటి హరిప్రసాద్‌కు ఘన సత్కారం

ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ ధర్మవరం పర్యటన సందర్భంగా, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ఆయనకు తేనీటి విందు ఏర్పాటు చేసి, దుషాలువలు కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన రెడ్డి మాట్లాడుతూ, హరిప్రసాద్ అనుభవం రాష్ట్రంలోని హస్తకళలకు నూతన ఉత్సాహాన్ని చేకూరుస్తుందని, ఆయన కృషి కళాకారులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అలాగే ఆయన రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

Share this content:

Post Comment