పోలవరం: పోలవరం ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించేందుకు సీఎం పర్యటనలో భాగంగా పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీను, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమనుగు రవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పనుల ప్రగతిపై మంత్రివర్యులు సమీక్ష జరిపి, తగిన సూచనలు చేశారు. పోలవరం ప్రజలకు ప్రాజెక్ట్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, ప్రస్తుత పనుల వేగం, ఎదురయ్యే సవాళ్లు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉందని, పోలవరం పనులను నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై, మంత్రి గారికి అశీస్సులు అందజేశారు.
Share this content:
Post Comment