జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంకు కృపారావుకు ఘన సన్మానం

మైలవరం: స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో కామన్వెల్త్ క్రీడలలో పవర్ లిఫ్టింగ్ విజేత సంకు కృపారావుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు పాల్గొన్నారు. వెంకటాపురం నుండి ర్యాలీగా మైలవరం జనసేన పార్టీ కార్యాలయం వరకు చేరుకొని తదుపరి పార్టీ కార్యాలయంలో కృపారావును ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, జి కొండూరు మండల అధ్యక్షులు వై.నరసింహారావు, మైలవరం మండల ఉపాధ్యక్షులు పడిగల ఉదయ్, జనసేన నాయకులు బత్తిన శ్రీనివాసరావు, భూక్య చిరంజీవి, పసుపులేటి నాగరాజు, ఆనం విజయ్, మాదాసు సుబ్బారావు, కూసుమంచి కిరణ్ కుమార్, పొన్నూరు విజయ్, చంద్రాల మురళీకృష్ణ, జనసైనికులు,వీర మహిళలు మరియు కృపారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.