కొణిదెల పవన్ కళ్యాణ్ సేవా దృక్పథాన్ని ముందుకు తీసుకుంటూ, జనసేన అభిమానులతో ఏర్పడిన జనసేవాదళ్ ఆధ్వర్యంలో మరోసారి మానవత్వం మెరిపించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అనిల్ కుమార్ హార్ట్ ఆపరేషన్ నిమిత్తం, కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ చేతుల మీదుగా యశోద హాస్పిటల్ (హైటెక్ సిటీ) వద్ద రూ.20,000 సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సలాది శంకర్, కలిగినీడి ప్రసాద్, తుట్టుపు లోవరాజు, సుంకర సాయి, మెండా వెంకట్, కాకులపాటి సుబ్రహ్మణ్యం, పులగం సుబ్బు పాల్గొన్నారు. జనసేవాదళ్ సేవా మార్గం మరింత మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
Share this content:
Post Comment