విజయోత్సవ ర్యాలీని తలపించిన “బత్తుల” భారీ బైక్ ర్యాలీ

  • కదం తొక్కిన జనసైన్యం
  • జనసంద్రంగా మారిన సీతానగరం రహదారులు
  • బత్తుల దంపతులకు అడుగడుగునా జననీరాజనం
  • బైక్ ర్యాలీకి వచ్చిన స్పందన చూస్తుంటే రాజానగరం నియోజకవర్గంలో వైసీపీకి 100% నూకలు చెల్లినట్టే
  • బైకులు ఇతర వాహనాలతో కిక్కిరిసిపోయిన బొబ్బిల్లంక – చిన్నకొండెపూడి రహదారి
  • బత్తుల దంపతులను చూసేందుకు భారీగా రోడ్లకు ఇరువైపులా వచ్చిన జనం

రాజానగరం నియోజకవర్గం: రాజానగరంలో బత్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ విజయోత్సవ ర్యాలీని తలపించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం బొబ్బిల్లంక గ్రామం నుండి నియోజకవర్గంలోని నాయకులు, జనసైనికులు, వీరమహిళలు వేలాది బైక్లతో, కార్లతో ర్యాలీగాప్రజా నాయకులు రాజానగరం ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి లకు ఘన స్వాగతం పలికి పెద్దఎత్తున భారీ బైక్ ర్యాలీగా చిన్నకొండెపూడి గ్రామం చేరుకున్నారు. గ్రామంలో చేరుకోగానే పెద్దఎత్తున బాణసంచా పేల్చుతూ.. తీన్మార్ డప్పులతో, పూలవర్షం కురిపిస్తూ యువత కేరింతలతో, మహిళల హారతులతో అడుగడుగునా బత్తుల దంపతులకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కిక్కిరిసిన రోడ్ల వెంబడి పాదయాత్ర చేస్తూ అందరికీ అభివాదం చేస్తూ.. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఈసారి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ పక్షాన నిలబడాలని అభ్యర్థిస్తూ ముందుకుసాగారు. ముగ్గళ్ళ గ్రామం చేరుకున్న బత్తుల దంపతులకు భారీ గజమాలతోజనసేన నాయకులు, జనసైనికులు స్వాగతం పలికారు.