రాష్ట్ర రోడ్ల దుస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ

  • జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు, రాష్ట్రంలో అద్వాన్నంగా ఉన్న రోడ్లపై జనసేన పార్టీ చేపట్టిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ కార్యక్రమానికి రికార్డ్ స్థాయిలో స్పందన వస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా అద్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితిపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోందని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని ఏ టీ అగ్రహారం ప్రధాన రహదారిలో నిర్వహించిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏ వీధిలో చూసినా రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని విమర్శించారు. ఈ రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రజలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని, ద్విచక్రవాహనాలు, ఆటోలు కొత్తవి సైతం కొన్ని రోజుల్లోనే పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని అసమర్ధ ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని ధ్వజమెత్తారు.
రాష్ట్ర కార్యదర్శి మైనారిటీ నాయకులు షేక్ నాయబ్ కమాల్ మాట్లాడుతూ మూడేళ్ళ వైసీపీ పాలనలో రాష్ట్రం ముప్పైఏళ్లు వెనక్కి వెల్లిందని విమర్శించారు. దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణిస్తూ ఆటో చక్రాలు, బస్సు టైర్లు ఎప్పుడు ఊడిపోతాయో అన్న భయంతో ప్రయాణం చేయాల్సివస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి పథంలో నడవాలి అంటే ప్రధానంగా రవాణా సౌకర్యాలు బాగుండాలని, రాష్ట్రంలో రహదారులే సరిగ్గా లేవని దుయ్యబట్టారు. జిల్లా వీరమహిళలు పార్వతి నాయుడు , పాకనాటి రమాదేవి, బిట్రగుంట మల్లికలు మాట్లాడుతూ ఇంటి నుంచి బయటికి వెళ్లిన వారు తిరిగి ఇంటికి వచ్చే దాకా భయంగానే ఉంటుందని, ఇలాంటి రోడ్ల మీద ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇంటికి చేరటం అంటే ఆ రోజుకి గండం గడిచినట్లుగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు లక్షల కోట్లు అప్పులు చేసిందని అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కిలోమీటర్ల రోడ్డు కూడా వేయలేదని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. అనంతరం దెబ్బతిన్న రోడ్లను ఫోటోలు తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్, కార్పొరేటర్ పద్మావతి, అడపా మాణిక్యాలరావు, ఆళ్ళ హరి, నారదాసు ప్రసాద్, రాజనాల నాగలక్ష్మి, కొల్లా పద్మావతి , కొర్రపాటి నాగేశ్వరరావు, వీరిశెట్టి సుబ్బారావు, లక్ష్మిశెట్టి నాని , విజయలక్ష్మి, ఆసియా, మాధవి, వరలక్ష్మి, హైమావతి, దాసరి వెంకటేశ్వరరావు, శ్రీపతి భూషయ్య, భీమా శ్రీను, పాండు రంగారావు, సాగర్, ఉపేంద్ర, పులిగడ్డ గోపి, మిద్దె నాగరాజు, రమేష్ నాయుడు, ఇస్మాయిల్, మధులాల్, రాజేష్, లెనిన్, కొనిదేటి కిషోర్, సతీష్, బాషా, శిఖా బాలు, కిరణ్, జెబీవై నాయుడు, తదితరులు పాల్గొన్నారు.