పవిత్ర దేవస్థానంలో అభివృద్ధి పరంపరకు కొత్త అధ్యాయం!

అమలాపురం మహిపాల వీధిలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ శ్రీదేవి-భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధిలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఆలయంలో నూతనంగా నిర్మించిన టికెట్ కౌంటర్‌ను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు పాల్గొన్నారు. ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకున్న యువ నాయకురాలు, కౌన్సిలర్ గండి దేవి హారిక స్వామి ఆలయ అభివృద్ధిలో తన స్థాయిలో తోడ్పాటు అందించేందుకు సన్నద్ధతను తెలియజేయగా, స్థానికుల నుంచి ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో ఈ.ఒ. వెంకటేశ్వరరావు, టిడిఎఫ్ పట్టణ అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ, దేవస్థానం ఇంచార్జ్ చైర్మన్ జంగా అబ్బయి వెంకన్న, ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను, గోకరకొండ లక్ష్మణ్, గంధం శ్రీను, నల్లా చిట్టిబాబు, బండారు వెంకటేశ్వరరావు, కుంచే వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. దేవస్థాన అభివృద్ధిలో ఇది మరో మైలురాయిగా నిలిచింది.

Share this content:

Post Comment