నూతన ఓటర్ లిస్ట్ ను పరిలించాలి

బొబ్బిలి నియోజకవర్గం: నూతన ఓటర్ లిస్ట్ ను పరిలించాలని బొబ్బిలి నియోజకవర్గం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా బొబ్బిలి జనసేన నిలయంలో నాయకులు సంచాన గంగాధర్, మరడాన రవి, పోతల శివశంకర్ మాట్లాతూ.. గతంలో కొత్త ఓట్లు రిజిస్ట్రేషన్ మరియు చనిపోయిన ఓట్లు తొలగించాలని డిమాండ్ చేయడం జరిగిందని, నూతనంగా ఎన్నికల అధికారి నూతన వాటర్ లిస్ట్ని విడుదల చేసారని, ఆ లిస్ట్ ని ప్రతి ఒక్క జనసైనికులు పరిశీలించాలని కోరారు. ఎందుకంటే మనం ఇచ్చిన సమాచారాన్ని ప్రభుత్వం ఎంతవరకు సక్రమంగా నిర్వహించింది. అనేది మనం పరిశీలన చేయవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు, అక్రమంగా ఓట్లు ఉన్నట్లయితే దొంగ ఓట్లు ఉన్నట్లయితే పార్టీ దృష్టికి పూర్తి సమాచారం ఇవ్వాలని కోరారు. జనసేన, టీడీపీ ప్రభుత్వ స్థాపనే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.