పలువురిని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ అయినాపురం పంచాయతీ మెట్లంక గ్రామంలో ప్రమాదవశాత్తు గాయపడిన ఎల్లమెల్లి లోకేష్ మరియు కొత్తలంక గ్రామంలో అనారోగ్యంతో బాధపడి హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటిదగ్గర బెడ్ రెస్ట్ తీసుకుంటున్న పోలిశెట్టి వెంకన్నలను పరామర్శించారు. వారితో జనసేన నాయకులు సానబోయిన మల్లికార్జునరావు, గోదశి పుండరీష్, జక్కంశెట్టి పండు, దూడల స్వామి, కడలి కొండ, గేదెల స్వరూప్ కుమార్, వంగ విజయ సీతారాం తదితరులు పాల్గొన్నారు.