ఎన్ టిపిఎస్ కాలుష్య సమస్యపై నిరసన దీక్ష

మైలవరం: జనసేన- తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొండపల్లి పురపాలక విటిపిఎస్ పాత గేట్ వద్ద జనసేన పార్టీ ఇంచార్జి అక్కల గాంధీ ఆదేశాల మేరకు తుమ్మలపాలెం ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి తేజ అధ్యక్షతన వి టి పి ఎస్ బూడిద వెదజల్లే వ్యర్ధాల వలన, వారి యొక్క నిర్లక్ష్య వైఖరి వలన పొల్యూషన్ తోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొన్ని ప్రధాన డిమాండ్లను యాజమాన్యం ఉంచడం జరిగినది. అవి కాలుష్య ప్రభావిత ప్రాంతాలకు అధికారికంగా రావలసిన సిఎస్సార్ నిధులను వెంటనే మంజూరు చేయాలని, తుమ్మలపాల గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న రెండు కెనాల్ వంతెనల నిర్మాణా పనులను వెంటనే చేపట్టాలని, గ్రామాలు మరియు మున్సిపాలిటీ పరిధిలో కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలని. ఉచిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని. బూడిద స్టాక్ పాయింట్లను వెంటనే తొలగించాలని, కాంట్రాక్టు ఉద్యోగం వెంటనే పర్మినెంట్ చేయాలని. బూడిద లోడింగ్ సులభతరం చేసి స్థానిక లారీ ఓనర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగినది. స్వచ్ఛమైన రక్షిత త్రాగునీరులో బూడిద కలవకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరడం జరిగింది. ఈ రకంగా పలు విషయాలపై ఉదయం 10:00 నుంచి సాయంత్రం 5:00 వరకు “నిరసన దీక్ష” చేపట్టడం జరిగినది. తేజతో పాటు, కొండపల్లి పురపాలక జనసేన మున్సిపాలిటీ నాయకులు చెరుకుమల్లి సురేష్, తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు చుట్టకు దురు శ్రీనివాసరావు, తెలుగుదేశం నాయకులు సైదులు, సిరిపురం సురేష్, వన్నెంరెడ్డి కోటేశ్వరరావు, దీక్ష చేపట్టగా. వారికి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమా, నాయకులు జంపాల సీతారామయ్య, రామినేని రాజ, చెరుకూరి వేణు, జనసేన పార్టీ నాయకులు బోలియాశెట్టి శ్రీకాంత్, ఎర్రంశెట్టి నాని, మైలవరం మండల అధ్యక్షులు బ్రహ్మయ్య, జి. కొండూరు మండల అధ్యక్షులు నరసింహారావు, రావి సౌజన్య, నేరుసు కృష్ణాంజనేయులు, ఠాకూర్ అజయ్ వర్మ మరియు నియోజకవర్గంలోని జనసేన మరియు తెలుగుదేశం పార్టీ మండల గ్రామ నాయకులు మరియు కౌన్సిలర్లు సంఘీభావం తెలియజేయడం జరిగింది.