మంథని, మందమర్రి మార్కెట్ ఏరియాలోని గల బస్టాండులోనికి మంచిర్యాల నుండి బెల్లంపల్లి ఏరియా వైపు వెళ్లే బస్సులు మరియు హైదరాబాదుకు వెళ్లే బస్సులను పునరుద్ధరించాలని చెప్పి మంగళవారం మంచిర్యాల జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్ కి జనసేన పార్టీ మంథని నియోజకవర్గం ఇంచార్జ్ & ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నాయకులు మాయ రమేష్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మందమర్రి మార్కెట్ ఏరియాలో గల బస్టాండ్ లోనికి హైదరాబాద్ వెళ్లడానికి మంచిర్యాల డిపోకు సంబంధించిన రెండు సూపర్ లగ్జరీ బస్సులను నడిపేవారు అందులోనుండి 8033 బస్సును పూర్తిగా రద్దు చేయడం జరిగింది. బెల్లంపల్లి నుండి వచ్చే 8023 బస్సు మందమర్రి మార్కెట్ బస్టాండ్ లోకి వచ్చి వెళ్ళేది ఇప్పుడు 8023 బస్సు రావడం లేదు దానితో హైదరాబాద్ వెళ్లడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి రాత్రి సమయంలో సరైన రవాణా సౌకర్యం లేక బస్టాండ్ కు వెళ్లి బస్సు ఉన్న సమయానికంటే మూడు నుంచి నాలుగు గంటలు మందమర్రి యాపల్ బస్టాండ్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దానితో ప్రయాణికులు చాలా ఇబ్బందిపడుతున్నారు. కనుక వెంటనే ఈ యొక్క సమస్యపై స్పందించి వెంటనే మంచిర్యాల డిపో ఆర్టీసీ మేనేజర్ రద్దైన బస్సులు పునరుద్ధరించాలి మరియు మార్కెట్కు మంచిర్యాల నుండి బెల్లంపల్లి ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ వైపు వెళ్లేటువంటి బస్సులను మందమర్రి మార్కెట్ లోపలికి వచ్చే విధంగా చూడాలని చెప్పి కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశాది సురేష్, శివ, రాజు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment