ఓటు వేసే హక్కు కల్పించాలని కలెక్టరుకు వినతి

కాకినాడ, పౌర సంక్షేమ సంఘ ప్రతినిధి దుసర్లపూడి రమణరాజు ఆధ్వర్యంలో, అఖిలపక్ష పార్టీల నాయకులతో కలిసి జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ కాకినాడ కార్పొరేషన్లో 6 గ్రామాలను విలీనం చేసి, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ ప్రాంతాల ప్రజలకు ఓటు వేసే హక్కు కల్పించాలని, కోరుతూ ఇంద్రపాలెం నుండి పాదయాత్ర చేసుకుంటూ కలెక్టర్ ఆఫీస్ సెంటర్ వద్దగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కలెక్టర్ వారికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ తూరంగి, ఇంద్రపాలెం, చీడీగ, రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి గ్రామాల్లో, మరియు 42,48 డివిజన్లలో ఎన్నికలు నిలిపివేయడం వల్ల పూర్తిగా అభివృద్ధి కుంటుపడిపోయింది. ఆయా ప్రాంతాల ప్రజలు డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్యం సరిగా లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి సరైన ప్రజా ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల అధికారులు సరిగా పట్టించుకోకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయి. అందువల్ల పై ప్రాంతాలను కాకినాడ కార్పొరేషన్లో కలిపివేయాలని, జరగబోయే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయాలని, రాబోయే రోజుల్లో అన్నింటిని కలిపి కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లాలని, దానివల్ల 12 ఏళ్లుగా పై ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించవచ్చని జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ తెలిపారు.