*కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్
నర్సాపురం మున్సిపల్ కార్యాలయం మరియు ఎంపీడీవో కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ వెండ్ర. వి.డి.వి. ప్రసాద్, శానిటరీ మేస్త్రీలు ఆకుల రమణబాబు, ఈదా జోజిబాబు మరియు పంచాయతీ కార్యదర్శి సోడదాసి మోహన్ రావు పదవీవిరమణ నేపథ్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, పదవీవిరమణ పొందిన అధికారులను శాలువాలతో సత్కరించి, వారి సేవలను స్ఫూర్తిదాయకంగా అభివర్ణించారు. ప్రజల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని, వారి ధర్మపరాయణత యువతకు మార్గదర్శకమని కొనియాడారు. ఈ వేడుకలో ఆర్డీవో దాసురాజు, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, పలువురు అధికారులతో పాటు, జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పదవీవిరమణ పొందిన అధికారులకు అభినందనలు తెలిపారు.

Share this content:
Post Comment