పుణ్యక్షేత్రం గ్రామంలో టీడీపీకి ఎదురుదెబ్బ

  • టీడీపీ కీలక నేతలు వారి అనుచరులు జనసేనలో చేరిక
  • రాజానగరం నియోజకవర్గంలో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిన జనసేన పార్టీ.

రాజానగరం, రాజానగరం మండలం, పుణ్యక్షేత్రం గ్రామంలో టీడీపీ పార్టీ నుండి బలమైన రాజకీయ నేపధ్యం ఉన్న కీలక నేతలు వారు అనుచరులు, వివిధ కుటుంబాలకు చెందిన మహిళలు సుమారు 100 మంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు అలానే రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ అనునిత్యం చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు, జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలపరుస్తున్న వారి సమర్థవంతమైన నాయకత్వానికి ఆకర్షితులై రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ బత్తుల దంపతులు జనసేన కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయం కోసం అందరూ సమిష్టిగా కృషిచేద్దామని, పార్టీలో చేరిన వారికి, పార్టీ కోసం వారు కష్టపడే విధానం, వారి సామర్ధ్యం మేరకు తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని, నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా తాను ముందుండి ఆదుకుంటామని దానికి తనను సంప్రదించాలని అన్నారు. టీడీపీ నుండి జనసేనలో చేరిన వారిలో నర్రావుల రమణ, నర్రావుల లోవరాజు వీరి అనుచరగణం, వివిధ కుటుంబాలకు చెందిన మహిళలు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మద్దిరెడ్డి బాబులు, సర్పంచ్ అభ్యర్థి రేలంగి భాస్కర్ గౌడ్, జనసేన ఎంపీటిసి అభ్యర్థి వంక సత్తిబాబు, తెల్లమేకల శ్రీను, రేలంగి శివమణి మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి మెడిశెట్టి శివరాం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మర్పిఎస్ మాజీ అధ్యక్షులు కొత్తపల్లి రఘు, శ్రీకృషపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరాం, వేగిశెట్టి రాజు, రఘునాదపురం వీర్రాజు, బాబూరావు, మన్యం శ్రీను, తోట అనిల్ వాసు ఇతర నేతలు మరియు పుణ్యక్షేత్రం జనసేన యువత పెద్దఎత్తున పాల్గొన్నారు.