జనసేన ఉమ్మడి కరీంనగర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

*జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళులు

*పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పలువురు జనసేన పార్టీలో చేరిక
*కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉమ్మడి జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర యువజన సెక్రెటరీ మూల హరీష్ గౌడ్ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్ల యువజన అధ్యక్షులు రావుల మధు సూచనల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి 131వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి శివ రెడ్డి చల్లా పాల్గొని అంబేద్కర్ గారి ఫోటో కి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన మనము స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. ఇలాంటి గొప్ప వ్యక్తికి భారత దేశ ప్రజలు రుణగ్రస్తులు.. అని అన్నారు. అనంతరం ఓద్యారం గ్రామ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పలువురు జనసేన పార్టీ ఆశయాలకు సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరడం జరిగింది. వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ యువజన ఎగ్జిక్యూటివ్ మెంబర్ పండుగ కుమార్, విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రేమ్ కుమార్, ప్రశాంత్, పవన్, శివ, అనిల్, పలువురు జనసేన పార్టీ నాయకులు యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.