- శేరిలింగంపల్లి జనసేన పార్టీ ఇంచార్జి డా.కె.మాధవరెడ్డి
శేరిలింగంపల్లి, తమ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ సాయంతోనే ప్రజలు వారి సమస్యలపై తమకు పిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చని శేరిలింగంపల్లి జనసేన పార్టీ ఇంచార్జి డా.కె.మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఇంచార్జ్ మాధవ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గానికి మాధవ రెడ్డి పేరుతో ప్రత్యేక యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాధవ రెడ్డి మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా ప్రజలు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, జనసేన టీమ్‌తో నేరుగా సంప్రదించవచ్చని, తమ సమస్యలను తెలియజేసి, అవి జనసేన కోర్ టీమ్‌కు నేరుగా చేరేలా చేయవచ్చని మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వులిసి శ్రీనివాసరావు, హఫీజ్‌పేట్ ప్రధాన కార్యదర్శి నిరంజన్ కుమార్ కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు సుధాకర్, కో-ఆర్డినేషన్, శ్రవణ్ కుమార్, రవితేజ పాల్గొన్నారు.
Share this content:
Post Comment