గొందిపర్లలో క్రియాశీలక ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశం

ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన – టిడిపి పార్టీల సమన్వయ కమిటీ అధ్యక్షులు సురేష్ బాబు చింతా ఆదేశాల మేరకు గొందిపర్ల గ్రామ నాయకులు కరాటే రాంబాబు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలపేద దిశగా ముందుకు తీసుకువెళ్లే విధంగా అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో కృషి చేయాలని జనసేన & టిడిపి సమన్వయ కమిటీ సభ్యులు ఆకేగోపు రాంబాబు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ నాయకులు లక్ష్మన్న, కృష్ణ బాబు, మహబూబ్ బాషా, సురేంద్ర, కుమార్, మధుసూదన్, రమతుల్లా, ఇస్మాయిల్, హుస్సేన్, సునీల్, రాజు, చిరంజీవి, అనిల్, వంశీ గొందిపర్ల గ్రామస్తులు జనసైనికులు ప్రవీణు, విజయ్, నరసింహ, నవీన్ మిత్రబృందం, జనసైనికులు పాల్గొనడం జరిగింది.