మదనపల్లి నియోజకవర్గంలో జనసేన, బీజేపీ, టిడిపి పార్టీల ఆత్మీయ సమావేశం

మదనపల్లి నియోజకవర్గంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు శ్రీ రామ రామాంజనేయులు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు మరియు వీరమహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ.. ఎవరైనా వాలితో ఎదురుగా యుద్ధం చేస్తే వారి బలంలో సగం హరించే వరం వాలికి అదనపు బలం ఉన్నటు మదనపల్లి ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా నిత్యం ప్రజల్లో తిరుగుతూ రోజుకు రోజుకు బలం పెంచుకుంటూ పోతున్నారు అన్నారు. అలాగే మదనపల్లి అభిరుద్ది చెందాలి అంటే, అందరికీ న్యాయం జరగాలి అంటే షాజహాన్ బాషా గారిని ఎమ్మెల్యే గా మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి ఎంపీ గా అత్యంత బారి మెజారిటీతో గెలిపించుకొవాలి అని మదనపల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.